Success: వినోద్​కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్​

Success: వినోద్​కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్​

ఆధునిక హిందీ సాహిత్యంలో సుప్రసిద్ధ సాహితీవేత్త, కవి వినోద్​కుమార్​ శుక్లాకు 2024కు గాను జ్ఞాన్​పీఠ్​ పురస్కారం లభించింది. ఛత్తీస్​గఢ్​కు చెందిన వినోద్​కుమార్​ శుక్లా అనేక నవలలు, కథలు, కవితలు రాశారు. దీవార్​ మే ఏక్​ ఖిడ్కీ థీ అనే నవలకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ప్రముఖ ఒడియా రచయిత్రి ప్రతిభా రే అధ్యక్షతన సమావేశమైన జ్యూరీ వినోద్​కుమార్​శుక్లాకు జ్ఞానపీఠ్​ పురస్కారం ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించింది.

ఈ పురస్కారాన్ని అందుకున్న హిందీ రచయితల్లో వినోద్​ కుమార్​ శుక్లా 12వ వారు కాగా, ఛత్తీస్​గఢ్​ నుంచి జ్ఞాన్​పీఠ్​ అవార్డు అందుకోనున్న తొలి రచయిత. ఈ ఏడాది జ్ఞాన్​పీఠ్​ అవార్డు గ్రహీతను ఎంపిక చేసేందుకు ఏర్పాటైన జ్యూరీలో ప్రతిభా రేతోపాటు కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు మాధవ్​ కౌశిక్​, ప్రముఖ రచయితలు ప్రభావర్మ, దామోదర్​ మోజో, అనామిక, ప్రఫుల్ షిలేదార్, జానకీ ప్రసాద్​ వర్మ, జర్నలిస్టు కృష్ణారావు ఉన్నారు.